Manchu Manoj: మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాం నాన్న 1 y ago
మార్చి 19న తెలుగు సీనియర్ హీరో మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ X వేదికగా పోస్ట్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే నాన్నా.. మనమంతా కలిసి వేడుకలు చేసుకునే ఈ రోజు మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాం. మీతో కలిసి ఉండే క్షణాల కోసం ఎదురుచూస్తున్నాను.. లవ్ యూ’ అని ట్విట్ చేశారు. కాగా, ఇటీవల మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు జరిగి మనోజ్ కుటుంబానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.